Best Viewed in Mozilla Firefox, Google Chrome

వరంగల్ అగ్రికల్చర్

30
Jan

వరి రైతులకు వడగండ్ల పరిహారం రూ. కోటి 24 లక్షలు మంజూరు

వరంగల్ అగ్రికల్చర్/కలెక్టరేట్ (టీమీడియా): జిల్లాలో మొట్టమొదటి సారి వరి రైతులకు మాత్రమే వడగండ్ల పరిహా రం అందుతోంది. అగ్రికల్చర్ ఇన్సూరెన్స్ కంపెనీ ఎట్టకేలకు వడగండ్ల వానకు నష్టపోయిన వరి రైతులకు పరిహారాన్ని అం దించేందుకు ముందుకు వచ్చింది. నాలుగైదు సంవత్సరాలుగా వడగండ్లవానకు నష్టపోయిన రైతులకు ఇప్పటి వ ర కు పరిహారమివ్వలేదు. 2013 రబీలో ఏప్రిల్‌లో కురిసిన వ డగండ్ల వానకు జిల్లాలోని 14 మండలాల్లో పంటలకు నష్టం వాటిల్లినట్లు ఆ ఇన్సూరెన్స్ కంపెనీ గుర్తించింది. వాతావరణ స్థితిగతులను గుర్తించేందుకు వాతావరణ బీమా శాఖ రాష్ట్ర వ్యాప్తంగా అన్ని సబ్‌స్టేషన్లలో వాతావరణాన్ని లెక్కించే యంత్రాలను ఏర్పాటు చేసింది.

వాటి ఆధారంగానే వడగండ్లను, వాతావరణాన్ని లెక్కించారు. దీంతో ఆయా మండలాల్లోని రైతులకు పరిహారమిచ్చేందుకు అగ్రికల్చర్ బీమా కంపెనీ ముందుకు వచ్చింది. జిల్లా వ్యాప్తంగా 1357 మంది వరి రైతులకు రూ. కోటి 24 లక్షల రూపాయల పరిహారాన్ని మంజూరు చేసింది. అందులో భాగంగా బుధవారం బ్యాం కు ఖాతాలు లేని బచ్చన్నపేట మండలానికి చెందిన 240, ధర్మసాగర్‌కు చెందిన ఒకరికి, పరకాలకు చెందిన ముగ్గురు రైతులకు రూ. 19లక్షల 65వేల రూపాయలను పరిహార చె క్‌లను లబ్ధిదారులకు కలెక్టర్ కిషన్ నేరుగా అందజేశారు.

14 మండలాలు, 1357 మంది రైతులు..
జిల్లాలో 14 మండలాలు వడగండ్లవానకు గురైనట్లుగా గుర్తించారు. అందులో బచ్చన్నపేట, దే వరుప్పుల, స్టేషన్‌ఘనపూర్, హసన్‌పర్తి, జనగామ, మద్దూరు, మహబూబాబాద్, మంగపేట, మరిపెడ, మొగుళ్లప ల్లి, పర్వతగిరి, రఘునాథ్‌పల్లి, రాయప ర్తి, తాడ్వాయి, జపఫర్‌గడ్ మండలాల లు ఉన్నాయి. పరహారాన్ని పూర్తిగా వరి రైతులకే అందిస్తున్నట్లు అగ్రికల్చర్ ఇ న్సూరెన్స్ కంపెనీ డీజీఓం నాగార్జున టీమీడియాకు తెలిపారు. బ్యాంకు ఖాతాలు తీసుకున్న రైతుల కు పరిహారాన్ని నేరుగా ఖాతాల్లోనే జమ చేస్తున్నట్లు స్పష్టం చేశారు. కార్యక్రమంలో వ్యవసాయ శాఖ జాయింట్ డైరెక్టర్ రామారావు, అ గ్రికల్చరల్ ఇన్సూరెన్స్ ఆఫ్ ఇండియా అధికారులు, రైతులు, తదితరులు పాల్గొన్నారు

Syndicate content
Copy rights | Disclaimer | RKMP Policies