అగ్గి తెగులు రెండు రకాలుగా ఉంటుంది.
1. ఆకుమీద మచ్చలుగా వచ్చే అగ్గి తెగులు
2. మెడ విరుపు తెగులు
ఆంగ్ల నామం : రైస్ బ్లాస్ట్
ఆకుమీద మచ్చలుగా వచ్చే అగ్గి తెగులు లక్షణాలు
1. ఈ తెగులు మొదట ఆకుల మీద తెలుపు, బూడిద లేక నీలం రంగు గల చిన్న చిన్న (1-3 మి.మీ. వ్యాసం) మచ్చలుగా కనిపిస్తుంది.
2. తేమ ఎక్కువగా ఉన్న సమయాలలో తెగులును తట్టుకోని రకాలపై ఈ మచ్చలు వేగంగా పెరిగి, కొనలు తేలి `నూలు కండె' (లేదా కన్ను) ఆకారంలోకి మారతాయి.
3. ఈ మచ్చలు మధ్యలో బూడిద లేక తెలుపు రంగును కలిగి ఉండి, అంచులు గోధుమ లేక ఎరుపు కలిసిన గోధుమ రంగులో ఉంటాయి.
4. తెగులును తట్టుకోని రకాలపై పూర్తిగా అభివృద్ధి చెందిన మచ్చలు 1 నుండి 1.5 సెం. మీ. పొడవుండి, 0.3 నుండి 0.5 సెం.మీ. వెడల్పు ఉంటాయి.
మెడ విరుపు తెగులు లక్షణాలు
1. వెన్నుల కణుపుల వద్ద పైరిక్యులేరియా ఒరైజా అన్న శిలీంద్రం ఆశించినప్పుడు ఈ మెడ