Best Viewed in Mozilla Firefox, Google Chrome

బి.పి.హెచ్. / డబ్ల్యూ.బి.పి.హెచ్. నివారణ

  • ఎసిఫేట్ 1.5 గ్రా. లేదా మొనోక్రోటోఫాస్ 2.2 మి.లీ. లేదా ఎథోఫెన్ ప్రాక్స్ 2.0 మి.లీ. లేదా ఫేనోబ్యుకార్బ్ 2.0 మి.లీ. లేదా ఇమిడాక్లోప్రిడ్ 0.25 మి.లీ. లేదా థయామేథోక్సాం 0.2 గ్రా లేదా బ్యుప్రోఫ్యుజిన్ 1.6 మి.లీ. చొప్పున లీటరు నీటిలో కలిపి పిచికారీ చెయ్యడం.
  • పిచికారీ చేసే మందు (ఎకరానికి 200 లీ.) మొక్క మొదలు తడిచేలా పిచికారీ చెయ్యాలి.
  • పురుగు మందులు, సింథటిక్ పైరెథ్రాయిడ్స్ కలిపి పిచికారీ చెయ్యకూడదు.
  • రెండవసారి కనుల పిచికారి చెయ్యవలసివస్తే అంతకు ముందు చల్లిన మందుకాక వేరొక వర్గానికి చెందిన మందు చల్లాలి.

బి.పి.హెచ్. / డబ్ల్యూ.బి.పి.హెచ్.

స్థానిక నామం : దోమ / తెల్ల మచ్చ దోమ

శాస్త్రీయ నామం : నీలపర్వత లుజెన్స్ / సోగటెల్ల ఫ్రుసిఫేరా

లక్షణాలు :

1. ఈ పురుగు వరిని అన్ని దశలలో ఆశిస్తుంది. పెద్ద పురుగులు, పిల్ల పురుగులు దుబ్బుల నుండి రసాన్ని పీలుస్తాయి. క్రమేసి మొక్కలు పసుపు రంగులోకి మారి ఎండిపోతాయి.

2. ఈ పురుగు పోషక కణజాలాన్ని ఆశించుట వలన, ఇవి పీల్చివేసిన రసంలో ఉన్న పోషకాలు మొక్కకు అందకుండా పోతాయి.

3. ఈ పురుగు ఆశించిన తొలి దశలో పొలంలో సుడులు సుడులుగా మొక్కలు గోధుమ రంగులోకి మారి చివరకు ఎండిపోతాయి.

4. ఈ లక్షణాలు పొలంలో ఒక చోట నుండి చుట్టుపక్కలకి వ్యాపిస్తాయి. దీనినే `దోమ పోటు' అని అంటారు.

5. ఈ దోమలు మొక్క మొదలుదగ్గర విడుదల చేసిన తేనె మంచుపై మసి తెగులు బాగా వృద్ది చెందుతుంది. నేరుగా నష్టాన్ని కలుగచేయడంతో బాటు ఈ పురుగు గ్రాస్సీ స్టంట్ తెగులును కూ

09
Aug

తాటాకు తెగులు (హిస్పా)

తాటాకు తెగులు (హిస్పా)

స్థానిక నామం : తాటాకు తెగులు (హిస్పా)

శాస్త్రీయ నామం : డైక్లడిస్పా ఆర్మీజేరా

లక్షణాలు :

1. పెంకు పురుగులు ఆకుల పత్రహరితాన్ని తింటాయి. పిల్ల పురుగులు ఆకు పొరల్లో దూరి అక్కడ కోశస్థ దశకు చేరుకుంటాయి.

2. పెంకు పురుగులు ఆకు ఈనెల మధ్యనగల పత్రహరితాన్ని గోకి తినడం వలన తెల్లటి సమాంతరమైన చారలు ఏర్పడతాయి. తరువాత ఈనెలు కూడా తినివేయబడినందున ఆకుల మీద పెద్ద పెద్ద మచ్చలు ఏర్పడతాయి.

3. పురుగు ఉధృతి ఎక్కువగా ఉన్న సందర్భాల్లో ఆకులు ఎండిపోయి పంటంతా మాడిపోయినట్లు కనిపిస్తుంది. తాటాకు తెగులు (హిస్పా)

నివారణ

1.ప్రోఫెనోఫాస్ 2.0 మి.లీ. లేదా క్లోరోపైరీఫాస్ 2.5 మీ.లీ. లేదా మొనోక్రోటోఫాస్ 1.6 మీ.లీ., లీటరు నీటిలో కలిపి పిచికారీ చెయ్యాలి.

09
Aug

ఆకుముడత పురుగు

ఆకుముడత పురుగు

స్థానిక నామం : ఆకుముడత పురుగు

శాస్త్రీయ నామం : నెఫలోక్రోసిస్ మెడినాలిస్

లక్షణాలు :

1. తినడానికి ముందు గొంగళి పురుగు ఆకులను పొడవుగా మడిచి, ఆకుల వంచలను పట్టులాంటి దారంతో కలిపి కుడుతుంది.

2. గొంగళి పురుగు ఆకు ముడుతలో ఉండి పత్ర హరితాన్ని గోకి తినివేయడం వలన ఆకులపై పొడవైన తెల్లని చారలు ఏర్పడతాయి. ఈ గొంగళి పురుగులు రెండవ దశ చివరి నుండి ఆకులను చుట్టలుగా చుడుతూ ఒంటరిగా జీవిస్తాయి.

3. ఈ పురుగు ఆశించిన మొక్కల ఆరోగ్యం క్షీణించి కిరణజన్య సంయోగ క్రియా సామర్ధ్యం గణనీయంగా తగ్గిపోతుంది. పురుగు ఉధృతి ఎక్కువగా ఉన్నప్పుడు ఆకు అంచులు, కొనలు పూర్తిగా ఎండిపోయి పంట పాలిపోయినట్లు కనిపిస్తుంది. పురుగు ఆశించిన ఆకుల ద్వారా శిలీంద్రాలు, సూక్ష్మ జీవులు కూడా ప్రవేశిస్తాయి.

ఆకుముడత పురుగు నివారణ

1. ప్రోఫెనోఫాస్ 2.0 మి.లీ. లేదా క్లోరోపైర

09
Aug

గొట్టాల పురుగు నివారణ

గొట్టాల పురుగు నివారణ

1. ఒక చోట వరి నాట్లు మూడు వారాలలోపే పూర్తిచెయ్యాలి. ఆగి ఆగి నాటకూడదు.

2. ఫోరేట్ 10 జి హెక్టారుకు 12.5 కిలోల చొప్పున లేదా కార్బోఫ్యురాన్

3 జి హెక్టారుకు 25 కిలోల చొప్పున నాటిన 15 రోజులకు 1 - 2 అంగుళాల లోతు నీరు ఉన్నప్పుడు వెయ్యాలి.

09
Aug

గొట్టాల పురుగు

గొట్టాల పురుగు

స్థానిక నామం : గొట్టాల పురుగు

శాస్త్రీయ నామం : ఒర్సియోలియా ఒరైజే

లక్షణాలు :

1. గొట్టాల పురుగు నష్టాన్ని కలుగ చేసే దశ పిల్ల పురుగు దశ (మాగట్ దశ). ఈ పిల్ల పురుగులు పెరుగుతున్న మొవ్వు భాగాన్ని తినివేసి కొత్తగా ఏర్పడుతున్న ఆకుల అభివృద్ధిని ఆటంకపరుస్తాయి.

2. దీని మూలంగా లోపల ఉన్న అంకురం కిరణాల వలె రేఖాకృతిలోకి మారి ఆకు మట్ట పొడవుగా సాగుతుంది.

3. పిల్ల పురుగు చుట్టూ `డొల్ల' లా ఏర్పడి, పురుగు తినడం కొనసాగుతూ ఉన్నకొద్దీ ఈ డొల్ల అడుగు భాగంలో ఉబ్బి, సాగి ఉల్లి ఆకు ఆకారంలోకి మారుతుంది.

4. లార్వా దశలో 3 `ఇన్స్టార్' అంతర్దశలు ఉంటాయి. సాధారణంగా ఒక్కో దుబ్బులో ఒక్కో పిల్ల పురుగు ఉంటుంది.

5. `ఉల్లి కోళ్ళు' ఏర్పడినప్పుడు గొట్టాల పురుగు నష్టం పైకి తెలిసినప్పటికీ పిల్ల పురుగులు మొవ్వు దగ్గరకు చేరిన వారానికే `డొల్ల'లు ఏర్పడతాయి.

6. ఒ

కాండం తొలుచు పురుగు నివారణ

  • మొనోక్రోటోఫాస్ 36 ఎస్.ఎల్. 1.6 మీ.లీ. లేదా క్లోరోపైరీఫాస్ 20 ఇ.సి. 2.5 మీ.లీ. లేదా ఫాస్ఫామిడాన్ 40 ఎస్.ఎల్. 2 .0 మీ.లీ., లీటరు నీటిలో కలిపి పిచికారీ చెయ్యాలి.  
  • పొలంలో చ.మీ. స్థలంలో ఒక పెద్ద పురుగు కానీ, ఒక గుడ్ల సముదాయం కానీ కనిపించినప్పుడు కార్టాప్ హైద్రోక్లోరైడ్ 50 డబ్ల్యూ.పి. 2 .0 గ్రా లేదా ఎసిఫేట్ 1.5 గ్రా లేదా ప్రోఫేనోఫాస్ 2.0 మీ.లీ. , లీటరు నీటిలో కలిపి పిచికారీ చెయ్యాలి లేదా కార్టాప్ హైద్రోక్లోరైడ్ 4 జి. గుళికలు ఎకరానికి 8 కిలోల చొప్పున వేయాలి.
09
Aug

కాండం తొలుచు పురుగు

కాండం తొలుచు పురుగు

స్థానిక నామం : కాండం తొలుచు పురుగు

శాస్త్రీయ నామం : సిర్పోఫాగాస్ ఇన్సె ర్ట్యులస్

లక్షణాలు :

1. కాండం తొలుచు పురుగులు వరి దుబ్బును తొలిచి తిని, పెరిగి, పంట దశ బట్టి `డెడ్ హార్ట్', `తెల్ల కంకి' వంటి లక్షణాలు కలుగచేస్తాయి

2. పిలకలు వేసే సమయంలో మొవ్వు భాగాన్ని ఈ పురుగు అడుగునుండి తినివేస్తుంది.

3. అడుగున ఉన్న ఆకులు ఆకుపచ్చగా, ఆరోగ్యంగా ఉన్నప్పటికీ సుడి ఆకు విచ్చుకోకుండా, మట్టి రంగులోకి మారి ఎండిపోతుంది.

4. కంకులు బయటకు వచ్చే సమయంలో మొవ్వు తెగిపోవడం వలన కంకులు ఎండి పోతాయి. అసలు కంకులు బయటకు రాకపోవచ్చు. బయటకు వచ్చిన కంకులలో గింజలు ఏర్పడవు.

5. ఈ గింజలు ఏర్పడని కంకులు నిటారుగా, తెల్లగా ఉండి పొలంలో ప్రస్ఫుటంగా కనిపిస్తాయి.

ఆంధ్ర ప్రదేశ్ లో వరిని ఆశించే ప్రధానమైన పురుగులు

1. కాండం తొలుచు పురుగు

2. గొట్టాల పురుగు

3. ఆకుముడత పురుగు

4. తాటాకు తెగులు (హిస్పా)

5. ఆకు నల్లి

6. బి.పి.హెచ్./ డబ్ల్యూ.బి.పి.హెచ్.

7. కంకి నల్లి

Copy rights | Disclaimer | RKMP Policies