Best Viewed in Mozilla Firefox, Google Chrome

పొడ తెగులు

PrintPrintSend to friendSend to friend

ఆంగ్ల నామం : షీట్ బ్లైట్

తెగులును కలుగచేసే జీవి: రైజోక్టోనియా సొలానీ

లక్షణాలు :

1. పొడ తెగులు సాధారణంగా పైరు తర్వాతి దశలలో కనిపిస్తుంది.

2. దుబ్బు చేసే దశలో లేదా కణుపులు సాగే తొలి దశలలో (దాదాపు నీరు కట్టిన 10-15 రోజుల తరువాత) నీటి మట్టానికి దగ్గరగా, అడుగున ఉన్న ఆకులు, మట్టలపై మచ్చలు ఏర్పడతాయి. ఈ తెగులు తొలి దశలో కనిపించే లక్షణాలు ప్రాంతం బట్టి మారుతూ ఉంటాయి.

3. ఈ మచ్చలు సాధారణంగా ఆకు మొదళ్ళలో ఆకుపచ్చ కలిసిన ఊదా రంగులో, 1/4 అంగుళం వెడల్పున, 1/2 నుండి 1 1/4 అంగుళాల పొడవున కోలగా, నీటి డాగు మచ్చలలాగ మొదలౌతాయి.

4. వెన్ను పైకి వచ్చు దశ నుండి, పాలుపోసుకునే దశ మధ్యలో, తరచూ వర్షాలు పడుతున్నప్పుడు, ఆకాశం మేఘావృతమైనప్పుడు ఈ తెగులు వేగంగా వ్యాపిస్తుంది.

5. ఆకులు పండిపోయాక ఈ మచ్చలు ఎండి ముదురు గోధుమ రంగు అంచులు కల బూడిద రంగు మచ్చలుగా మారతాయి.

6. మొదట తెల్లగా ఉంది క్రమేసి ముదురు గోధుమ రంగులోకి మారే శిలీంద్ర బీజాలు ఈ మచ్చల మీద కానీ, పక్కల కానీ ఏర్పడతాయి. ఇవి పైపైనే ఏర్పడి మొక్కను తాకగానే రాలిపోతాయి.

File Courtesy: 
రైస్ బ్లాస్ట్ డిసీస్ అండ్ ఇట్స్ మానేజ్మెంట్ (వరి అగ్గి తెగులు, యాజమాన్యం) - డా. కృష్ణవేణి
Image Courtesy: 
ఎ.పి.ఆర్.ఆర్.ఐ., మారుటేరు
Copy rights | Disclaimer | RKMP Policies