Best Viewed in Mozilla Firefox, Google Chrome

గొట్టాల పురుగు

PrintPrintSend to friendSend to friend

గొట్టాల పురుగు

స్థానిక నామం : గొట్టాల పురుగు

శాస్త్రీయ నామం : ఒర్సియోలియా ఒరైజే

లక్షణాలు :

1. గొట్టాల పురుగు నష్టాన్ని కలుగ చేసే దశ పిల్ల పురుగు దశ (మాగట్ దశ). ఈ పిల్ల పురుగులు పెరుగుతున్న మొవ్వు భాగాన్ని తినివేసి కొత్తగా ఏర్పడుతున్న ఆకుల అభివృద్ధిని ఆటంకపరుస్తాయి.

2. దీని మూలంగా లోపల ఉన్న అంకురం కిరణాల వలె రేఖాకృతిలోకి మారి ఆకు మట్ట పొడవుగా సాగుతుంది.

3. పిల్ల పురుగు చుట్టూ `డొల్ల' లా ఏర్పడి, పురుగు తినడం కొనసాగుతూ ఉన్నకొద్దీ ఈ డొల్ల అడుగు భాగంలో ఉబ్బి, సాగి ఉల్లి ఆకు ఆకారంలోకి మారుతుంది.

4. లార్వా దశలో 3 `ఇన్స్టార్' అంతర్దశలు ఉంటాయి. సాధారణంగా ఒక్కో దుబ్బులో ఒక్కో పిల్ల పురుగు ఉంటుంది.

5. `ఉల్లి కోళ్ళు' ఏర్పడినప్పుడు గొట్టాల పురుగు నష్టం పైకి తెలిసినప్పటికీ పిల్ల పురుగులు మొవ్వు దగ్గరకు చేరిన వారానికే `డొల్ల'లు ఏర్పడతాయి.

6. ఒక్కోసారి ఈ `డొల్లలు ఏర్పడకపోయినప్పటికీ మొవ్వు భాగం కుళ్ళిపోతుంది. ఉల్లి కోళ్ళు ఎక్కువగా ఏర్పడినప్పుడు పిలకలు కూడా ఎక్కువగా ఏర్పడతాయి.

File Courtesy: 
APRRI, Maruteru
Image Courtesy: 
ఎ.పి.ఆర్.ఆర్.ఐ., మారుటేరు
Copy rights | Disclaimer | RKMP Policies