Best Viewed in Mozilla Firefox, Google Chrome

బి.పి.హెచ్. / డబ్ల్యూ.బి.పి.హెచ్.

PrintPrintSend to friendSend to friend

బి.పి.హెచ్. / డబ్ల్యూ.బి.పి.హెచ్.

స్థానిక నామం : దోమ / తెల్ల మచ్చ దోమ

శాస్త్రీయ నామం : నీలపర్వత లుజెన్స్ / సోగటెల్ల ఫ్రుసిఫేరా

లక్షణాలు :

1. ఈ పురుగు వరిని అన్ని దశలలో ఆశిస్తుంది. పెద్ద పురుగులు, పిల్ల పురుగులు దుబ్బుల నుండి రసాన్ని పీలుస్తాయి. క్రమేసి మొక్కలు పసుపు రంగులోకి మారి ఎండిపోతాయి.

2. ఈ పురుగు పోషక కణజాలాన్ని ఆశించుట వలన, ఇవి పీల్చివేసిన రసంలో ఉన్న పోషకాలు మొక్కకు అందకుండా పోతాయి.

3. ఈ పురుగు ఆశించిన తొలి దశలో పొలంలో సుడులు సుడులుగా మొక్కలు గోధుమ రంగులోకి మారి చివరకు ఎండిపోతాయి.

4. ఈ లక్షణాలు పొలంలో ఒక చోట నుండి చుట్టుపక్కలకి వ్యాపిస్తాయి. దీనినే `దోమ పోటు' అని అంటారు.

5. ఈ దోమలు మొక్క మొదలుదగ్గర విడుదల చేసిన తేనె మంచుపై మసి తెగులు బాగా వృద్ది చెందుతుంది. నేరుగా నష్టాన్ని కలుగచేయడంతో బాటు ఈ పురుగు గ్రాస్సీ స్టంట్ తెగులును కూడా వ్యాపింప చేస్తుంది.

File Courtesy: 
APRRI, Maruteru
Image Courtesy: 
ఎ.పి.ఆర్.ఆర్.ఐ., మారుటేరు
Copy rights | Disclaimer | RKMP Policies